- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ట్రీట్‌మెంట్… తెర మీదకి కీళ్ల నొప్పుల మందు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 కోసం ప్రత్యేకంగా మందు ఏదీ లేదు. దీంతో మొన్న హైడ్రాక్సీక్లోరోక్విన్… నిన్న రెమ్డేసివిర్… నేడు టోసిలిజుమాబ్… ఇలా రోజుకొకటి తెరమీదకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ కొవిడ్ 19కి ఆమోదించిన మందులు కాదు. కేవలం కొద్దిపాటి ఉపశమనాన్ని ఇచ్చేవే. అయితే కొవిడ్ 19తో విషమ పరిస్థితిలో ఉన్నవారికి టోసిలిజుమాబ్ అనే కీళ్లనొప్పుల ఔషధం మెరుగ్గా ఉపయోగపడుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్యారిస్ యూనివర్సిటీ హాస్పిటల్ ట్రస్ట్ పలువురు బాధితులపై నిర్వహించిన ప్రయోగం ద్వారా ఈ విషయం తెలిసింది.
కరోనా సోకిన వారిలో శ్వాస సంబంధ సమస్యలు ముందుగా కనిపిస్తున్నాయి. వీటిలో 5 నుంచి 10 శాతం మంది వైరల్ న్యుమోనియా బారిన పడుతున్నారు. రోగనిరోధక శక్తి అతిస్పందనతో ఏర్పడే సైటోకైన్ ప్రోటీన్ కారణంగా ఈ సమస్య వల్ల మరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే టోసిలిజుమాబ్‌లోని కృత్రిమ యాంటీబాడీ… సైటోకైన్ ప్రోటీన్ గ్రాహకానికి వ్యతిరేకంగా పని చేసి ప్రాణభయాన్ని తగ్గిస్తుంది.
Tags – corona, covid, cytokine, protein, to siliguri, oxygen