జాబితా వచ్చేసింది.. కొత్త కేంద్ర మంత్రులు వీళ్లే

by Shamantha N |   ( Updated:2021-07-07 06:21:02.0  )
జాబితా వచ్చేసింది.. కొత్త కేంద్ర మంత్రులు వీళ్లే
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రివర్గం విస్తరణలో భాగంగా కొత్త చేర్పులతోపాటు పోర్ట్‌ఫోలియో, ఇతర మార్పులు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు 43 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా బెర్త్ కన్ఫమ్ చేసుకున్నవారిలో బీజేపీ నేతలు నారాయణ్ రాణె, సర్బనందా సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ భట్, భూపేందర్ యాదవ్, శోభా కరండ్లజె, సునీతా దుగ్గల్, మీనాక్షి లేఖి, భారతి పవార్, శాంతాను ఠాకూర్, కపిల్ పాటిల్, మిత్రపక్షం జేడీయూ నుంచి ఆర్‌సీపీ సింగ్, ఎల్‌జేపీ నుంచి పశుపతి పరాస్, అప్నా దళ్ నుంచి అనుప్రియ పటేల్‌లున్నారు. వీరు మరికాసేపట్లో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర సహాయ మంత్రులు జీ కిశన్ రెడ్డి, పర్షోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్‌లకు ప్రమోషన్ వచ్చే అవకాశముందని సమాచారం. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది మంత్రుల జాబితా ఇలా ఉన్నది.

Advertisement

Next Story