NEET UG టాపర్.. ఫలితం అంతకు మించి వస్తుందని అస్సలు ఊహించలేదు!

by Shamantha N |
NEET UG టాపర్.. ఫలితం అంతకు మించి వస్తుందని అస్సలు ఊహించలేదు!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా నిన్న NEET UG -2021 ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎంట్రన్స్ టెస్టులో ముంబై‌కు చెందిన విద్యార్థి కార్తీక జి.నాయర్ టాప్ స్కోర్ చేసింది. సరిగ్గా ఫలితాలు విడుదల అయ్యే రోజు అనగా నవంబర్ ఒకటవ తేది (సోమవారం) ఆమె పుట్టిన రోజు. ఫలితాలు విడుదల అయ్యాక మార్కులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యిందట కార్తీక..

ఎందుకంటే రిజల్ట్స్ ఇలా వస్తాయని తాను ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. ‘‘ప్రిపరేషన్ టైంలో తాను ఎంతో కష్టపడ్డానని, కానీ ఫలితం తన అంచనాలకు మించి ఉంది’’. నీట్ యూజీలో 720/720 మార్కులు వచ్చాయని వెల్లడించింది. ఆ షాక్ నుంచి తేరుకున్నాక జస్ట్ ఇద్దరితో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నానని పేర్కొంది. ఇక తన మెయిన్ ఫోకస్ ఆంకాలజీ పై ఉంటుందని కార్తీక చెప్పింది.

Advertisement

Next Story