గోవా తీరంలో గగనతల వీరుడి మృతదేహం!

by srinivas |   ( Updated:2020-12-07 10:05:57.0  )
గోవా తీరంలో గగనతల వీరుడి మృతదేహం!
X

దిశ, వెబ్‌డెస్క్ : నేవీ గగనతల విన్యాసాల్లో భాగంగా నవంబర్‌ 26వ తేదీన మిగ్‌-29కే శిక్షణ విమానం ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక పైలట్‌ను నేవీ రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడగా, మరో పైలట్ మాత్రం కనిపించకుండా పోయాడు. నాటి నుంచి హెలికాప్టర్లు, అధునాతన బోట్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గోవా తీరానికి 30 మైళ్ల దూరంలో 70 అడుగుల మీటర్ల నీటి లోతులో మరో పైలట్ నిశాంత్ సింగ్ మృతదేహం సోమవారం లభ్యమైంది.

ఎట్టకేలకు పదిరోజుల నిరీక్షణ తర్వాత నేవీ పైలట్ మృతదేహం అవశేషాలను సముద్రంలో గుర్తించినట్లు నేవీ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం నిశాంత్ సింగ్ మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పంపించామని చెప్పారు. పరీక్షల అనంతరం మృతదేహాన్ని నిషాంత్ కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.

Advertisement

Next Story