- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సందేశ్ ఖాళీలో మరోసారి ఉద్రిక్తత.. సీఎంకు లేఖ రాసిన గవర్నర్
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల తర్వాత హింస చెలరేగింది. ఈ హింసపై బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని సీఎం మమతా బెనర్జీని కోరారు. ఈ విషయంపై మమతా బెనర్జీకి లేఖ రాశారు. శనివారం పోలింగ్ ముగిసిన కొన్నిగంటలకే మహిళలపై దాడులు జరిగినట్లు తెల్సిందని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.. ఇలాంటి దాడులు కొనసాగితే సహించేది లేదన్నారు. బాధిత మహిళల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. రాజ్ భవన్ లో సురక్షితంగా ఆశ్రయం పొందవచ్చని అన్నారు.
సందేశ్ ఖాళీలో ఉద్రిక్తత
ఎన్నికలు ముగిసిన కొన్నిగంటలకే సందేశ్ ఖాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అగర్హతి గ్రామంలో పోలీసులపై కొందరు దుండగులు దాడులు జరిపారు. అయితే, ఈకేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన పోలీసులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు గ్రామంలోకి వెళ్లకుండా చెట్ల కొమ్మలను పడగొట్టి.. రహదారిని దిగ్బంధించారు.