ప్రతీకారం తీర్చుకుంటా.. కథువా ఉగ్రదాడిపై రక్షణశాఖ ప్రకటన

by Shamantha N |
ప్రతీకారం తీర్చుకుంటా.. కథువా ఉగ్రదాడిపై రక్షణశాఖ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిపై రక్షణశాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే అన్నారు. “కథువాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ధైర్యవంతులను కోల్పోయినందుకు ప్రగాఢ సానుభూతి వ్యక్తి చేస్తున్నా. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. వారి త్యాగాన్ని వృథాగా పోనివ్వం. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోం. దాడి వెనుక ఉన్న దుష్టశక్తులపై భారత్ పగ తీర్చుకుంచుంది” అని గిరిధర్ సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు.

కథువాలో ఉగ్రదాడి

కథువాలోని మాచెడి ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా.. దాడి తర్వాత ముష్కరులు అడవిలోకి పారిపోయారు. వారి ఆచూకీకోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పాక్ కు చెందిన జైషే మహ్మద్ షాడో సంస్థ కశ్మీర్ టైగర్స్ ఈదాడికి బాధ్యత వహించింది. ఇకపోతే, రెండ్రోజులు ఆర్మీపై జరిగిన రెండో దాడి ఇది. గత కొంతకాలంగా కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed