- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘నూబ్’.. విపక్షంపైకి ప్రధాని మోడీ కొత్త అస్త్రం.. ఏమిటిది ?
దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని ప్రముఖ గేమర్లతో జరిగిన చిట్ చాట్ కార్యక్రమం వేదిక నుంచి కూడా విపక్షాలపైకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఈసందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతను ఉద్దేశించి ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. గేమర్లు తరుచుగా వినియోగించే ‘నూబ్’ అనే పదాన్ని ఈసందర్భంగా ప్రధాని మోడీ ఉపయోగించారు. నూబ్ అంటే కొత్త వ్యక్తి లేదా నైపుణ్యం లేని వ్యక్తి అని అర్థం. ‘‘ఎన్నికల ప్రచారంలో నేను ‘నూబ్’ అనే పదాన్ని ఉపయోగిస్తే .. నేనేం మాట్లాడు తున్నాను.. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనేది అర్థం కాక ప్రజలు ఆశ్చర్యపోతారు. ‘నూబ్’ గురించి మీకు తెలుసు కాబట్టి రాజకీయాల్లో ఆ లక్షణాలున్న వ్యక్తి ఎవరో మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు’’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఫ్రీవీలింగ్ ఛాట్ సమయంలో గేమర్లు అందరూ కలిసి ప్రధాని మోడీకి ‘నమో ఓపీ’ అనే పేరు పెట్టారు. ఓపీ అంటే ఓవర్ పవర్డ్ (అత్యంత శక్తివంతుడు). ఈసందర్భంగా జీటీజీ (గాట్ టు గో), ఏఎఫ్‌కే (కీబోర్డ్‌కు దూరంగా) అనే పదాలను గేమర్ల నుంచి మోడీ నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గేమర్లతో కలిసి కొన్ని వీడియో గేమ్స్ కూడా మోడీ ఆడారు.