- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Green Crackers: దీపావళికి గ్రీన్ క్రాకర్స్.. వీటి వల్ల హాని ఉండదా ?
దిశ, వెబ్ డెస్క్: దీపావళి (Diwali 2024).. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా యావత్ దేశమంతా ఏకమై జరుపుకునే పండుగ. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా దీపావళిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి అంటే.. దీపాల పండుగ. ప్రతీ ఇంట్లో ఆశ్వీయుజ అమావాస్య రోజు సాయంత్రం.. పూజలు చేసి, దేవుని ముందు దీపాలను వెలిగించి.. ఆ దీపాలను గుమ్మాలవద్ద, గేట్లకు ఇరువైపులా పెడతారు. కానీ.. దీపాలు పెట్టడం కంటే.. క్రాకర్స్ (Diwali Crackers) పేల్చడమే ఎక్కువవుతోంది. వాయుకాలుష్యం పెరిగితే ఊపిరి పీల్చుకోవడం ఎంతకష్టంగా ఉంటుందో చెప్పేందుకు మన దేశరాజధాని ఢిల్లీనే ఉదాహరణ.
అక్కడ వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గాలినాణ్యత (Delhi Air Quality) పూర్తిగా పడిపోయింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, చుట్టుపక్కల పొలాల్లో వ్యర్థాలు తగలబెట్టడంతో వచ్చే పొగతో.. పట్టపగలే మంచుకమ్మినట్లుండే దృశ్యాలు కనిపిస్తాయి. అంతకాలుష్యంలో ఊపిరి పీల్చుకోవడం అంటే.. గగనమనే చెప్పాలి. అందుకే దీపావళికి ఢిల్లీలో టపాసులు పేల్చడాన్ని నిషేధించారు. టపాసులు పేల్చితే.. దానికారణంగా గాలినాణ్యత ఇంకా ప్రమాదకరస్థాయికి చేరుతుంది. ఒక్క దీపావళికే కాదు.. ఏ ఫంక్షన్ కీ అక్కడే క్రాకర్స్ వాడకూడదు. డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రమాణాలకు కట్టుబడి లేకపోతే.. ఢిల్లీ ప్రజలు 10 సంవత్సరాల ఆయుషాన్ని కోల్పోతారని ఒక అధ్యయనం తెలిపింది.
ఇప్పుడిదే దేశాన్ని కలచివేస్తోంది. ఢిల్లీలోనే కాదు.. కొన్ని ప్రధాన నగరాల్లోనూ వాయుకాలుష్యం పెరుగుతోంది. కొన్నిరాష్ట్రాలు దానిని అధిగమించేందుకు దీపావళికి ఆంక్షలు విధించకుండా.. గ్రీన్ కాకర్స్ మాత్రమే వాడాలని ఆదేశించాయి. అదేంటి.. మామూలు టపాసులకు, గ్రీన్ క్రాకర్స్ (Green Crackers)కి తేడా ఏంటని చూస్తున్నారా ? తేడా ఉంది.
మన దేశంలో 2019 నుంచి గ్రీన్ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మూడు రకాలున్నాయి. సేఫ్ వాటర్ రిలీజర్ (SWAS), సేఫ్ థర్మైట్ క్రాకర్స్ (STAR), సేఫ్ మినిమల్ అల్యూమినియం (SAFAL). బాణసంచాలపై CSIR NEERI లోగో ఉంటే అవి గ్రీన్ క్రాకర్స్ అని అర్థం. సాధారణంగా కాల్చే క్రాకర్స్ తో పోలిస్తే.. గ్రీన్ క్రాకర్స్ వల్ల 30 శాతం కాలుష్యం తగ్గుతుంది. వీటిని పేల్చినపుడు నీటి ఆవిరి విడుదలవుతుంది. అది దుమ్మును ఎక్కువగా రేగకుండా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు.. సాధారణ పటాకుల నుంచి 160 డెసిబల్స్ సౌండ్ రిలీజైతే.. గ్రీన్ క్రాకర్స్ నుంచి 110 నుంచి 125 డెసిబల్స్ సౌండ్ ఉత్పత్తి అవుతుంది. శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది.
కానీ.. దీపావళికి ఏ క్రాకర్స్ పేల్చినా కాలుష్యం మాత్రం ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ అయితే ఆ కాలుష్యం కాస్త తక్కువగా ఉంటుందంతే. కాలుష్యం పెరిగితే శ్వాసకోశ సమస్యలు పెరిగి.. మనిషి ఆయుష్షు తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. మన ఆయుర్దాయం కంటే.. క్రాకర్స్ కాల్చడం ఇంపార్టెంట్ కాదు కదా. అందుకే వీలైతే దీపావళికి టపాసులు పేల్చడం ఆపండి. ఆ డబ్బుతో ఎవరికైనా సహాయం చేయండి. లేదంటే మీరే పొదుపు చేసుకోండి.