ప్రధాని మోడీ 'అబద్దాల గూడు' అల్లుతున్నారు: కాంగ్రెస్ చీఫ్ ఖర్గె కౌంటర్

by S Gopi |
ప్రధాని మోడీ అబద్దాల గూడు అల్లుతున్నారు: కాంగ్రెస్ చీఫ్ ఖర్గె కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నుంచి గట్టి విమర్శలు వస్తున్నాయి. 'నిరుద్యోగంపై బూటకపు కథనాలు వ్యాప్తి చేసే వారిని ' ఈ ఉద్యోగాలు నోరు మూయించాయని ప్రధాని చెప్పిన నేపథ్యంలో.. కాంగ్రెస్ బదులిస్తూ మోడీ 'అబద్దాల గూడు ' అల్లుతున్నారని ఆరోపించింది. 'ప్రధాని మోడీ ముంబైలో జరిగిన కార్యక్రమంలో కోట్ల ఉద్యోగాలిచ్చినట్టు అబద్దాలు అల్లుతున్నారు. 2020 ఆగష్టులోనూ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ప్రకటించే సమయంలో.. ఎన్ఆర్ఏ సాధారణ అర్హత పరీక్షల విధానం కోట్లాది మంది యువకులకు వరం లాంటిది. పరీక్షల్లో పారదర్శకతను రుజువు చేస్తుందని మోడీ చెప్పారు. కానీ, గత నాలుగేళ్లలో ఎన్ఆర్ఏ ఒక్క పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు. ఈ ఏజెన్సీ కోసం రూ. 1,517 కోట్ల నిధులు కేటాయిస్తే రూ. 58 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఏర్పాటైన ఎన్ఆర్ఏ ఎందుకు పనిచేయకుండా పోయింది? ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల రిజర్వేషన్ హక్కులను లాక్కోడానికే కదా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఎన్‌టీఏను పరీక్షల్లో అవకతవకలకు, పేపర్ లీక్‌లకు ఉపయోగించారు. ఎన్ఆర్ఏ ద్వారా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువత భవిష్యత్తు బ్రష్టు పట్టిస్తోంది. ఇదివరకు తాము వీటిలోని సమస్యలను లేవనెత్తితే, ప్రధాని మోడీ మౌనం వహించారని ఖర్గె విమర్శించారు.

Advertisement

Next Story