- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకూ మోడీ లాంటి లీడర్ కావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్
దిశ, నేషనల్ బ్యూరో: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ భారత్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లిన బలమైన నాయకుడని కొనియాడారు. మూడోసారి కూడా మోడీ దేశ ప్రధానిగా తిరిగి వస్తారని తెలిపారు. పాకిస్థాన్‌కు కూడా మోడీ లాంటి నాయకుడు రావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. మోడీ కేవలం భారత్‌కు మాత్రమే గాక ప్రపంచానికి సైతం నాయకుడని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ‘మోడీ పుట్టుకతోనే గొప్ప లీడర్. ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో పర్యటించిన ఏకైక ప్రధాని ఆయనే. పాకిస్థాన్‌తోనూ చర్చలు జరిపి త్వరలోనే వాణిజ్యం ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. పాక్ శాంతి యుతంగా ఉండటం భారత్‌కు కూడా మంచిదేనని చెప్పారు. భారతదేశానికి తదుపరి ప్రధాని మోడీ అని ప్రతిచోటా రాసి ఉందన్నారు.
భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమని తరార్ అన్నారు. అక్కడ మోడీకి ఉన్న ప్రజాదరణను చూస్తున్నానని, 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉందని వెల్లడించారు. భారత్ నుంచి ప్రజలు భవిష్యత్‌లో ఎంతో నేర్చుకుంటారని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దీని ఫలితంగా పీఓకే సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సామాజిక అశాంతి ఏర్పడిందని అన్నారు. ఇంత జరుగుతున్నా అట్టడుగు సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన నాయకత్వం రావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, బాల్టి మోర్‌కు చెందిన సాజిర్ 1990లలో అమెరికాకు వెళ్లారు. పాకిస్తాన్‌తో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.