Wayanad landslides: ఇద్దరు చిన్నారులు ‘మృత్యుంజయులు’

by Shamantha N |
Wayanad landslides: ఇద్దరు చిన్నారులు ‘మృత్యుంజయులు’
X

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ ప్రకృతి బీభత్సానికి వందలాది మంది చనిపోయారు. కాగా.. 40 రోజుల పసికందు, ఆమె ఆరేళ్ల సోదరుడు మృత్యుంజయులుగా నిలిచారు. రెస్క్యూ టీం వారిని కాపాడింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ ఫ్యామిలోని పసికందు అనారా, ఆమె సోదరుడు మహ్మద్ హయాన్ బయటపడ్డారు ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు వారి తల్లి తంజీరా తన ప్రాణాలను లెక్క చేయలేదని అధికారులు తెలిపారు. వరదల ధాటికి ఇద్దరు చిన్నారులతో పాటు తంజీరా ఇంటి పైకప్పు పైకి వెళ్లింది. అకస్మాత్తుగా వరద ప్రవాహం ఎక్కువ అవడంతో హయాన్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అదృష్టవ శాత్తు.. హయాన్‌ 100 మీటర్ల దూరం వెళ్లి బావి పక్కనే ఉన్న తీగకు చిక్కుకుపోయాడు. దీంతో.. రెస్క్యూ టీమ్ అతన్ని కాపాడింది. పిల్లలిద్దరూ క్షేమంగా ఉండడంతో తల్లి తంజీరా ఆనందానికి అవధులు లేవు. అయితే తంజీరా తల్లి, అమ్మమ్మ మాత్రం ప్రాణఆలు కోల్పోయారు.

ప్రకృతి విలయానికి 308 మంది బలి

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కి చేరింది. ప్రస్తుతం దాదాపు 250 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. రిలీఫ్, రెస్క్యూ వర్కర్లు ప్రస్తుతం శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. దీని కోసం సాంకేతికతను కూడా వాడుతున్నరు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముండకై, చుర్మల, అట్టమల, నూలప్పుజ గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. ఎంత మంది ప్రభావితమయ్యారో అంచనా వేయడం ప్రభుత్వాన్నికి కష్టంగా మారింది. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల మేఘాలు ఏర్పడుతున్నాయని.. దీంతో తక్కువ సమయంలోనే అధిక వర్షం కురుస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. గత వందేళ్లలో వర్షపాతం తీరు గతంలో కంటే ఎక్కువగా మారిందని పరిశోధనలు చెబుతున్నాయి.

Advertisement

Next Story