వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by M.Rajitha |
CPI Narayana Takes his Words Back Over Megastar Chiranjeevi
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళ రాష్ట్రం వయనాడ్ లో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించిందని ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేసారు. సీపీఐ పార్టీ వయనాఢ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ముప్పు ప్రాంతాలను సందర్శన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాద ఘటనలో దాదాపు 416 మంది ప్రాణ నష్టం జరిగితే అందులో 47 మంది సీపీఐ నాయకులను కోల్పోవడం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయనాఢ్ సంఘటన బాధాకరంగా ఉందన్నారు. శనివారం రోజున ప్రధాని మోడీ వయనాడ్ జిల్లాను సందర్శించారని, దాన్ని స్వాగతిస్తున్నామని , కానీ బాధితులకు కావాల్సినవి తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. కేవలం సందర్శనకు పరిమితం కాకుండా బాధితులకు అండగా నిలబడే విదంగా సహాయం చేస్తే బాగుండేదని నారాయణ విజ్ఞప్తి చేసారు. ఎల్ 3 నిబంధనలను అమలు చేసి దానితోపాటు వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. బాదితులను దాదాపు 13 శిబిరాలుగా ఏర్పాటు చేసి, వారికి కావాల్సినటువంటివి అందిస్తున్నామన్నారు. బాధితులు స్టవ్, కుక్కర్, మిక్సీ, ఐరన్ బాక్స్ కావాలని అడగడంతో ఇప్పించామని తెలిపారు. వీటితో పాటు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం నుంచి నిత్యవసర సరుకులు, బట్టలు కూడా వయనాడ్ కు చేరుకున్నాయని, త్వరలోనే వాటిని బాదితులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్, నాయకులు సాదిక్, అయ్యప్ప, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీకే మూర్తి, సిపిఐ వయనాడ్ జిల్లా కార్యదర్శి, ఐఏఎల్ రాష్ట్ర సభ్యులు ఈజె బాబు, ఏబి చరియన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed