Virat Kohli Doop: బంగ్లాదేశ్ అల్లర్లలో కింగ్ కోహ్లీ డూప్.. ఆర్సీబీ క్యాప్ తో నినాదాలు.. వీడియో వైరల్

by Prasad Jukanti |   ( Updated:2024-08-07 07:35:11.0  )
Virat Kohli Doop: బంగ్లాదేశ్ అల్లర్లలో కింగ్ కోహ్లీ డూప్.. ఆర్సీబీ క్యాప్ తో నినాదాలు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఉత్కంఠగా మారాయి. ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు పారిపోయి రావడం, అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడం అంతా చక చకా జరిగిపోయాయి. హసీనా రాజీనామా చేసినా ఇంకా ఆ దేశంలో అల్లర్లు చల్లారలేదు. అల్లరి మూకలు చెలరేగిపోతూనే ఉన్నారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ అల్లర్లలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డూప్ ఒకరు పాల్గొనడం వైరల్ గా మారింది. అచ్చం కింగ్ కోహ్లీని తలపించేలా ఉన్న ఓ యువకుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ క్యాప్ ధరించి ఆందోళనలో పాల్గొన్నాడు. అతడిని అక్కడి యువకులు భుజాలపై ఎత్తుకుని ఊరేగిస్తుంటే పెద్దఎత్తున నినాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం జరిగిన సంబరాలకు సంబంధించినదిగా తెలుస్తున్నది. ఈ వీడియోపై నెటినజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story