Viral: బర్త్ డే వేడుకల్లో ఊహించని ఘటన.. యువకుడిని చితక్కొట్టిన ఫ్రెండ్స్

by Hamsa |
Viral: బర్త్ డే వేడుకల్లో ఊహించని ఘటన.. యువకుడిని చితక్కొట్టిన ఫ్రెండ్స్
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో ప్రతి ఒక్క విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్ డే కానుండి పెళ్లి వరకు ప్రతి ఒక్క దానికి అందరినీ పిలిచి కొన్ని రోజులు ఆ ఫంక్షన్ గురించి చెప్పుకునేలా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇటీవల ముఖ్యంగా పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ను మరీ విచిత్రంగా చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆగ్రహానికి గురి చేస్తోంది.

సాధారణంగా పుట్టిన రోజు అంటే కేక్ కట్ చేసి తినడం కామన్. కానీ ఇటీవల సోషల్ మీడియాలో బర్త్ డే బంప్స్ అని యువకులు విచక్షణా రహితంగా బిహేవ్ చేస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఓ హాస్టల్‌లో ఓ యువకుడి బర్త్ డేను అతని ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత బంప్స్ అంటూ టేబుల్‌పై పడుకోబెట్టి వెనుకవైపు బెల్ట్, చెప్పులతో చితకొట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అది చూసిన వారంతా ఇవేం బర్త్ సెలబ్రేషన్స్ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story