ట్రైన్‌లో రెచ్చిపోయిన యువతి.. అలా డ్యాన్స్ చేసింది ఏంటి?

by Jakkula Samataha |   ( Updated:2024-03-06 15:38:52.0  )
ట్రైన్‌లో రెచ్చిపోయిన యువతి.. అలా డ్యాన్స్ చేసింది ఏంటి?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే క్షణాల్లో మనముందు ఉంటుంది.ప్రస్తుతం యూత్‌పై సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. పబ్లిక్ ప్లేస్ అనేది కూడా మరిచిపోయి, తమకు నచ్చిన ప్లేసెస్‌లో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో వారు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇక తాజాగా ఓ యువతి లోకల్ ట్రైన్‌లో అసభ్యంగా డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైలోని లోకల్ ట్రైన్‌లోని లేడీస్ బోగిలో ఓ అమ్మాయి, బ్లాక్ డ్రెస్‌లో సైయా మారే సాతా సాత్ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ, ఉన్న వీడియో షేర్ చేయగా ఇది చాలా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఆమె డ్యాన్స్ చేస్తుండగా, అందులో ఉన్న కొందరు ప్రయాణికులు తమ ముఖం దాచుకోగా, ఇష్టం లేని వారు ట్రైన్ దిగి వెళ్లిపోయారు. దీంతో ఈ రీల్ గమనించిన రైల్వే అధికారులు.ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్, ట్రైన్‌లో ఇలా డ్యాన్స్ చేయడం తప్పు, అంత అసభ్యకరంగా డ్యాన్స్ చేయాలా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story