- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీయే మళ్లీ ప్రధాని కావాలి.. దర్గాలో వక్ఫ్ బోర్డ్ చీఫ్ ప్రార్థనలు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీపై సంచలన కామెంట్లు చేశారు ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చీఫ్ షాదాబ్ షామ్స్. దేశానికి ప్రధాని మోడీ బలమైన నాయకత్వం కావాలని అన్నారు. ‘‘ప్రపంచమంతా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాల్లో గందరగోళ పరిస్థితులు, కలహ వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో భారత్‌కి మోడీ వంటి బలమైన నాయకత్వం అవసరం. ఆయన మూడోసారి అధికారంలోకి రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బలహీనమైన వారి చేతిలోకి అధికారం వెళ్తే దేశం నష్టపోతుంది’’ అని అన్నారు.
హరిద్వార్‌లోని పిరాన్ కలియార్‌లో సాబీర్ సాహెబ్ దర్గా వద్ద ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో కలిసి ప్రధాని మోడీ కోసం షాదబ్ చాదర్ సమర్పించారు. దేశ అభివృద్ధి కోసం మూడోసారి మోడీ అధికారంలోకి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు. మోడీ హయాంలో ప్రతి వర్గానికి లబ్ధి చేకూరిందన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని చెప్పారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రధాని మోడీ నాయకత్వంలో ముస్లింలకు గానీ, భారత రాజ్యాంగానికి గానీ ముప్పు లేదని కామెంట్స్ చేశఆరు. కొందరు రాజకీయ నాయకుల భవిష్యత్ మాత్రం ప్రమాదంలో పడిందని ఇండియా కూటమని ఉద్దేశించి అన్నారు. దేశ ప్రజల్ని, ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.