- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉత్తరప్రదేశ్ నుంచే బరిలో ఉన్న 10 మంది కేంద్రమంత్రులు.. ఎవరు ముందంజలో ఉన్నారంటే?
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అంచనాలకు వ్యతిరేకంగా వస్తున్నాయి. బీజేపీకి అధిక స్థానాలు వస్తాయనుకుంటే.. సమాజ్ వాదీ పార్టీ దూసుకుపోతుంది. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 10 మంది కేంద్రమంత్రులు ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగారు. చాలా మంది కేంద్రమంత్రులు వెనుకంజలో ఉన్నారు. వారు పోటీ చేసిన స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
కేంద్రమంత్రుల వివరాలివే..
వారణాసి: ప్రధాని మోడీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై లక్ష ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
లక్నో: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్పీ అభ్యర్థి రవిదాస్ మెహరోత్రాపై 62 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అమెథీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ అమేథీలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కేఎల్ శర్మ లక్షా 20 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఫతేపూర్: కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎస్పీ అభ్యర్థి నరేష్ చంద్ర మధ్య టగ్ ఆఫ్ వార్ నడస్తోంది. ప్రస్తుతం సాధ్వి నిరంజన్ జ్యోతి స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లారు.
చందౌలీ: కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండేపై సమాజ్ వాదీ పార్టీకి చెందిన బీరేంద్ర సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
ముజాఫర్ నగర్: కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ ఎస్పీ అభ్యర్థి హరేంద్ర సింగ్ మాలిక్ ముందంజలో ఉన్నారు.
మీర్జాపూర్: కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ పై ఎస్పీ అభ్యర్థి రమేశ్ చంద్ లీడింగ్ లో ఉన్నారు.
జలౌన్: కేంద్రమంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మపై ఎస్పీకి చెందిన నారాయణదాస్ ముందంజలో ఉన్నారు.
మోహన్ లాల్ గంజ్: పట్టణాభివృద్ధి మంత్రి కౌశల్ కిశోర్ పై ఎస్పీ అభ్యర్థి ఆర్కే చౌదరి లీడింగ్ లో ఉన్నారు.
ఖేరి: కేంద్రమంత్రి అజయ్ కుమార్ తేనిపై ఎస్పీ అభ్యర్థి ఉత్కర్ష్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు.