- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బారత్-ఇరాన్ ఒప్పందం.. ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా..!
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ తో భారత్ ఒప్పందాలపై అమెరిగా గుర్రుగా ఉంది.చాబహార్ పోర్టు నిర్వహణపై భారత్, ఇరాన్ మధ్య పదేళ్ల కీలక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే.. భారత్ ను పరోక్షంగా హెచ్చరించింది అమెరికా. ఇరాన్ తో ఒప్పందాలు జరిపే ఎవరిపైన అయినా ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది.
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ డీల్ గురించి మీడియాతో మాట్లాడారు. చాబహార్ పోర్టు నిర్వహణ కోసం భారత్- ఇరాన్ ఒప్పందం గురించి తెలిసిందన్నారు. ఇరాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు, విదేశాంగ విధానాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. అయితే, ఇరాన్ పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని.. వాటి అమలు కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇరాన్ తో ఎవరైనా బిజినెస్ డీలింగ్స్ జరిపితే.. వారిపైనా ఆంక్షలు పడే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని మరోసారి చెప్తున్నామన్నారు.
ఇకపోతే, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం జరిపేందుకు భారత్ కు ప్రధాన మార్గం చాబహార్ పోర్టు. కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేయవచ్చు. దీంతోపాటు అఫ్గాన్ కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు. ఈ పోర్టులో పదేళ్లపాటు టర్మినెల్ నిర్వహణపై భారత్, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి.