భార్యతో అసహజ లైంగిక శృంగారం నేరం కాదు!.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

by Ramesh Goud |
భార్యతో అసహజ లైంగిక శృంగారం నేరం కాదు!.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భర్త తనతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడని ఓ మహిళ వేసిన కేసులో.. భార్యతో అసహజ లైంగిక శృంగారం అత్యాచారంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక భర్త అసహజ శృంగారానికి పాల్పడితే.. ఆ భార్యకు 15 ఏళ్ల లోపు లేకుంటే.. భారత చట్టాల ప్రకారం అది మారిటల్ రేప్ కిందికి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో ఆమె అసమ్మతి అసంబద్దం అవుతుంది కాబట్టి, ఓ వ్యక్తి తన భార్యతో అసహజ శృంగారంలో నిమగ్నమవ్వడం ఆత్యాచారం కిందికి రాదని సింగిల్ జడ్జి జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లువాలియా అన్నారు.

భర్త తనతో అనేక సందర్భాల్లో అసహజ లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ అతని భార్య చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు రద్దు చేసింది. ఒక వ్యక్తి చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య తనతో నివశిస్తున్నప్పుడు అసహజ శృంగారం ఐపిసి సెక్షన్ 377 ప్రకారం నేరం కాదు కాబట్టి, ఈ ఆరోపణలు పనికిమాలిన వాటి ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది అని దానిపై తదుపరి చర్చలు అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఈ కేసులో న్యాయపరమైనా వేర్పాటు కారణంగా విడివిడిగా జీవిస్తున్న సమయంలో భార్యతో లైంగిక చర్యకు పాల్పడితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేసిన సమయంలో మాత్రమే సెక్షన్ 376B కింద మినహాయింపు ఇవ్వబడుతుందని, లేని పక్షంలో వైవాహిక అత్యాచారం కిందకి రాదని తేల్చి చెప్పారు.

ఈ కేసు 2019 లో నమోదు అయ్యింది. ఈ కేసులో ఒక భార్య తన వివాహం అయిన తర్వాత రెండవ సారి ఇంటికి తిరిగి వచ్చాక తన భర్త అనేక సార్లు తనతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ 2019 లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వైవాహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. తన భార్య వేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి దానిని రద్దు చేయాలని అభ్యర్థించారు. అతనికి, అతని భార్యకు మధ్య అసహజమైన లైంగిక సంబంధం ఏదైనా ఐపిసి సెక్షన్ 377 ప్రకారం నేరంగా పరిగణించబడదని అతను వాదించాడు.

Advertisement

Next Story

Most Viewed