గుర్రాల పందేనికి గాడిదను తెస్తున్నారు.. రాహుల్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2023-03-27 12:59:18.0  )
గుర్రాల పందేనికి గాడిదను తెస్తున్నారు.. రాహుల్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుర్రాల పందేనికి గాడిద తెస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన హర్దీప్ సింగ్.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు , అనంతర పరిణామాలపై స్పందించారు.

రాహుల్ గాంధీ అంశం కోర్టు పరిధిలోనిదన్నారు. దీనిపై ఆ పార్టీ కోర్టులో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విపక్ష నేతలు ధ్వజమెత్తారు.

Advertisement

Next Story