- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి దూకుడు
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి దూకుడు కన్పిస్తోంది. అధికార బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తుంది. యూపీలోని 80 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఇండియా కూటమి 43 స్థానల్లో ముందజలో ఉంది. బీజేపీ 36 స్థానాల్లో అధిక్యంలో ఉంది. యూపీ నుంచే కేంద్రమంత్రులు సహా పలువురు హై ప్రొఫైల్ నాయకులు పోటీ చేస్తున్నారు. రాయ్ బరేలీ, కన్నౌజ్, మొయిన్ పురిలో ఇండియా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు.
గెలుపు దిశగా ఇండియా కూటమి అభ్యర్థులు
రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. . కన్నౌజ్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. మొయిన్ పురిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
స్మృతి ఇరానీకి షాక్..
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మ 23, 428 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక, వారణాసిలో ప్రధాని మోడీ ముందంజలో దూసుకుపోతున్నారు. లక్నోలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మథురలో నటి, బీజేపీ అభ్యర్థి హేమమాలిని విజయానికి చేరువగా దూసుకుపోతున్నారు.