ఆయుధాలు కలిగి ఉన్నవారు లొంగిపోవాలి: అమిత్ షా

by Mahesh |
ఆయుధాలు కలిగి ఉన్నవారు లొంగిపోవాలి: అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమిత్ షా.. ప్రజలను సురక్షితంగా ఉంచడానికి వివిధ క్యాంపులకు తరలించిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు మణిపూర్ పోలీసుల ముందు లొంగిపోవాలని కోరారు. లేకుంటే రేపటి నుంచి కూంబింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఎవరి వద్ద ఆయుధాలు దొరికినా, కఠిన చర్యలు తీసుకుంటాము". కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. అలాగే మణిపూర్ ను అస్థిర పరిచేందుకు కొన్ని మూకలు ప్రయత్నిస్తున్నాయని.. నకిలీ వార్తలను ప్రజలు పట్టించుకోవద్దని మణిపూర్ పౌరులను ఆయన కోరారు.

Advertisement

Next Story