- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంగనాపై జరిగిన దాడి గురించి స్పందించిన సీఎం
దిశ, నేషనల్ బ్యూరో: కంగనాపై జరిగిన దాడి గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆగ్రహంతో కంగనాను చెప్పుతో కొట్టి ఉండొచ్చని అన్నారు. రైతుల నిరసనలపై కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలపైనే కుల్విందర్ ఇంకా కోపంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇలాంటి దాడులు మాత్రం జరగకూడాదని స్పష్టం చేశారు. పంజాబ్ మొత్తం ఉగ్రవాద రాష్ట్రం అని.. ఇక్కడే ఉగ్రవాదం ఉందని కంగనా చేసిన కామెంట్లను తప్పుబట్టారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబ్ అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. పంజాబ్ నుంచే దేశానికి ఆహారం ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ప్రతిసారీ ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు అని కంగనా అంటున్నారని విమర్శించారు. రైతులు నిరసనలు చేస్తే వారిని ఆమె ఉగ్రవాదులని అంటున్నారని.. అది తప్పని హితవు పలితారు.
కంగనాపై దాడి
గురువారం చండీగడ్ ఎయిర్ పోర్టులో కంగనాను సీఐఎస్ఎప్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెప్పుతో కొట్టారు. ఈ ఘటన జరిగిన తర్వాత కంగనా.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పంజాబ్ లో తీవ్రవాదం, హింస పెరిగిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నాని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపైనే పంజాబ్ సీఎం ఘాటుగా స్పందించారు.