ఫైరింగ్ ఆర్డర్స్ జారీ చేసిన ఆ రాష్ట్ర హోం శాఖ.. కారణమిదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-06 10:09:26.0  )
ఫైరింగ్ ఆర్డర్స్ జారీ చేసిన ఆ రాష్ట్ర హోం శాఖ.. కారణమిదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు అటు నాగాలాండ్‌కు తాకాయి. మైతీలను ఎస్టీల్లో చేర్చడంపై మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలువురు మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. అటు అల్లర్లను అదుపు చేసేందుకు ఫైరింగ్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పుడు ఇది నాగాలాండ్‌కూ వ్యాపించింది. ఆందోళనకారులు చర్చిలకు జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మైతీలను ఎస్టీల్లో చేర్చొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హింసను అదుపు చేయకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంత నష్టం జరగాలంటూ ట్వీట్స్ పెడుతున్నారు.

కాగా మణిపూర్ రాష్ట్రంలో మైతీ వర్గం ప్రజలు 40 శాతం వరకూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం వారిని ఎస్టీల్లో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై పలువురు గిరిజనులు కోర్టుకు వెళ్లారు. అక్కడ మైతీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో మణిపూర్‌లో 53 శాతం ఉన్న గిరిజన వర్గం భగ్గుమంది. మణిపూర్ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. విధృంసం సృష్టించాయి. పలువురు మైతీవర్గం ప్రజలపై దాడులకు దిగారు. వారి ఇళ్లను, షాపులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు పోయాయి. దీంతో మణిపూర్‌లో ఎమర్జెన్సీ విధించారు. దాడులకు తెగబడేవారిపై ఫైరింగ్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. అయినా సరే ఏదో ఒక చోట ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇది ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించింది. నాగాలాండ్‌లోనూ పలువురు ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed