Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో ఏర్పాటు చేసిన 'గోల్డెన్ డోర్' మొదటి ఫోటో విడుదల

by Prasanna |   ( Updated:2024-01-10 06:55:35.0  )
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో  ఏర్పాటు చేసిన గోల్డెన్ డోర్ మొదటి ఫోటో విడుదల
X

దిశ, ఫీచర్స్: కోట్లాది మంది హిందువుల కల అతి త్వరలో నేరవేరబోతుంది. మరి కొద్దీ రోజుల్లో అయోధ్యలో రాములు వారిని చూడబోతున్నాము. రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించే ముందు, ఆలయ బంగారు పూతతో ఉన్న తలుపుల మొదటి ఫోటోను ఈ రోజు విడుదల చేసారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న తలుపును ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

ఈ తలుపును హైదరాబాద్‌కు చెందిన ఓ కళాకారుడు తయారు చేశాడు.లక్షలాది మందికి మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన గొప్ప రామమందిరానికి సంబంధించిన 'ప్రాణ ప్రతిష్టాపన' వేడుక జనవరి 22న అయోధ్యలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు పాల్గొంటారు.

Advertisement

Next Story

Most Viewed