Congress chief: ప్రస్తుతం ఉండాల్సిన ధరలివే..! పెట్రోల్, డీజిల్ ధరలపై ఖర్గే సంచలన ట్వీట్

by Ramesh Goud |
Congress chief: ప్రస్తుతం ఉండాల్సిన ధరలివే..! పెట్రోల్, డీజిల్ ధరలపై ఖర్గే సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ బీజేపీ ఇందన దోపిడీ తగ్గట్లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ప్రెట్రోల్, డీజిల్ ధరలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో బీజేపీ ఇందన దోపిడీ ఆపాలంటూ ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు. దీనిపై ముడి చమురు ధరలు 32.5 శాతం తగ్గాయని, అయినప్పటికీ బీజేపి ఇంధన దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలు బీజేపీని ఓడించి, మోడీ ప్రేరేపిత ధరల పెరుగుదలను తిరస్కరిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఇందన ధరల గురించి ప్రస్తావిస్తూ.. మే 16, 2014 (ఢిల్లీ) ఒక బ్యారెల్ ముడిచమురు ధర $107.49 ఉండగా.. పెట్రోల్ ధర రూ.71.51, డీజిల్ ధర రూ.57.28 ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 16, 2024న ఒక బ్యారెల్ ముడిచమురు ధర $72.48 ఉన్నా.. పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62 ఉందని తెలిపారు. అప్పటి ధరలతో పోల్చుకుంటే, ప్రస్తుత ముడి చమురు ధరల ప్రకారం.. పెట్రోల్ ధర రూ.48.27 ఉండాలని, డీజిల్ ధర రూ.69.00 ఉండాలని తెలిపారు. ఇక ఈ పదేళ్ల వంద రోజుల్లో మోదీ ప్రభుత్వం ఇంధనంపై పన్ను విధించి 35 లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని చెప్పడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదని ఖర్గే అన్నారు.

Advertisement

Next Story