అత్యాచారం చేశాడని జోక్ గా చెప్పా.. యువతికి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చిన కోర్టు..

by Prasanna |   ( Updated:2024-05-07 05:14:46.0  )
అత్యాచారం చేశాడని జోక్ గా చెప్పా.. యువతికి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చిన కోర్టు..
X

దిశ, ఫీచర్స్: మహిళలు, బాలికల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. ముఖ్యంగా మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. సమాజంలో లైంగిక వేధింపులు, తెలియని పురుషుల నుండి వేధింపులు లేదా ఇతర సంఘటనలు ఎదురైతే, మీరు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే, కొంతమంది మహిళలు తమ పూర్తి ప్రయోజనం కోసం ఈ నియమాలను ఉపయోగిస్తారు. చట్టాన్ని, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమ భర్తలతో గొడవ పడుతున్నారు. భర్త, అత్తామామలపై నిరాధరరమైన ఆరోపణలు చేస్తున్నారు.

కొందరు అమ్మాయిలు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని,అవమానించాడని ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి క్షణాల్లో కొందరు ఏడుస్తూ ఉంటారు. కొందరు దానిని ఆయుధంగా చేసుకుని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. బరాదారి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2019లో అజయ్ అనే వ్యక్తి తన కుమార్తెను ఢిల్లీకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆమె తల్లి పేర్కొంది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి యువకుడు రిమాండ్ లో ఉన్నాడు. కేసు పెండింగ్ లో ఉంది.

తాజాగా ఈ కేసును కోర్టు విచారించింది.ఈక్రమంలో ఓ యువకుడు తనపై అత్యాచారం చేసినట్లు నార్మల్ గా చేశాడని ఓ యువతి న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది. ఆ అమ్మాయి చేసిన పని కారణంగా, యువకుడు నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజులు జైలులో గడపవలసి వచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసిన యువతికి, ఆమె తల్లి కూడా నాలుగేళ్ల పాటు జైలులో ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. 5,88,822 జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి తన తీర్పును కూడా ప్రకటించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, అదనంగా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని తీర్పునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed