Breaking News : క్షమాపణలు తెలిపిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం

by M.Rajitha |   ( Updated:2024-11-15 14:34:41.0  )
Breaking News : క్షమాపణలు తెలిపిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
X

దిశ, వెబ్ డెస్క్ : గత నెలలో దీపావళి వేడుకలు(Diwali Celebrations) బ్రిటన్ ప్రధాని కార్యాలయం(UK PMO) ఘనంగా జరిపింది. అయితే బ్రిటన్ జరిపిన దీపావళి వేడుకలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు గల ప్రధాన కారణం.. ఈ వేడుకల్లోని భోజనంలో మాంసం వడ్డించడం, మద్యాన్ని పంచడం. అయితే గత కొన్నేళ్లుగా బ్రిటన్ ప్రధాని దీపావళి వేడుకలకు అతిధ్యం ఇస్తున్నారు. దీపాలు వెలిగించడం, సాంప్రదాయ నృత్యాలు చేయడం వంటి కార్యక్రమాల తర్వాత శాకాహార భోజనంతో విందు వడ్డిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం మద్యం, మాంసం వడ్డించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం స్పందించింది. దీపావళి వేడుకల్లో మద్యం, మాంసం వడ్డించడంపై క్షమాపణలు తెలిపింది. తమకు భారతీయ పండుగలు, వేడుకలపై ఎంతో గౌరవం ఉందని.. ఈ ఘటన పొరపాటున జరిగిందని, మరోసారి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

Next Story