SBI: పెరగనున్న ఎస్‌బీఐ రుణభారం.. వడ్డీ రేట్ల పెంపు

by S Gopi |   ( Updated:2024-11-15 16:08:10.0  )
SBI: పెరగనున్న ఎస్‌బీఐ రుణభారం.. వడ్డీ రేట్ల పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలు మరింత భారం కానున్నాయి. నిధుల వ్యయం ఆధారిత (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎంపిక చేసిన కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. స‌వ‌రించిన రేట్లు శుక్రవారం(నవంబర్ 15) నుంచే అమ‌ల‌వుతాయ‌ని బ్యాంకు త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్ రేట్లను సవరిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం, మూడు నెలల కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్‌ను 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరిగింది. ఆరు నెలలకు 8.85 శాతం నుంచి 8.90 శాతాని చేరింది. కీలకమైన రిటైల్ రుణాలను ప్రభావితం చేసే ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్‌ను 8.95 శాతం నుంచి 9 శాతానికి పెంచారు.

Advertisement

Next Story

Most Viewed