India-China : భారత పర్యాటకులకు చైనా గుడ్ న్యూస్

by Y. Venkata Narasimha Reddy |
India-China : భారత పర్యాటకులకు చైనా గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)కు వెళ్లే భారత(India)పర్యాటకుల కోసం డ్రాగన్ దేశం గుడ్ న్యూస్ అందించింది. భారతీయ పౌరులకు వీసా ధర(Visa Prices)లపై తగ్గింపును మరో ఏడాది వరకు పొడిగించింది(Extended One Year). భారత్‌లోని చైనా దౌత్య కార్యాలయం తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. భారత్- చైనా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గించుకోవడం..రెండు దేశాల మధ్య సంబంధాలను బలపర్చుకోవడం లక్ష్యంగా చైనా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఫీజుల తగ్గింపు గడువు 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపింది. చైనాలో పర్యటించాలనుకునే విదేశీయుల ప్రయాణ విధానాలను రెగ్యులరైజ్ చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎంబసీ కార్యాలయం పేర్కొంది.

వాస్తవానికి గత ఏడాదే ఈ వీసా ధరలు తగ్గించారు. సింగిల్ ఎంట్రీ వీసాలకు రూ.2900, డబుల్ ఎంట్రీ వీసాలకు రూ.4,400 వసూలు చేస్తున్నారు. ఆరు నెలల వరకు గడువు ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు రూ.5,900, ఏడాది అంతకంటే ఎక్కువ గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాలకు రూ.8,800 చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది నుంచి ఇవే ధరలు కొనసాగతున్నాయి. ఈ ధరలను మరో ఏడాదికి చైనా పొడిగించడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed