ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో

by Hamsa |   ( Updated:2025-01-01 15:47:29.0  )
ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)‘రాజావారు రాణివారు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ టాలెంటెడ్ హీరో ఇటీవల ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఒక్కసారిగా క్రేజ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌రూబా’(Dilruba). అయితే ఈ సినిమాకు విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తుండగా.. రుక్సర్ థిల్లాన్(Ruksar Dhillon) ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. దీనిని శివమ్ సెల్యులాయిడ్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యాడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరిలో గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇటీవల ఇందులోంచి కిరణ్ అబ్బవరం లుక్ విడుదలై హైప్ పెంచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ తెలిపాడు. ‘దిల్‌రూబా’ మూవీ టీజర్(Teaser) జనవరి 3న విడుదల కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ప్రకటించాడు. అంతేకాకుండా హీరోయిన్‌తో బీచ్‌లో సైకిల్ మీద చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న పోస్టర్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లు ఫిదా చేస్తుంది.


Read More ...

Rapo22: రాపో22 నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆకట్టకుంటున్న పోస్టర్



Advertisement

Next Story

Most Viewed