- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Terrible Murder: రాష్ట్రంలో సంచలనం.. అయ్యప్ప మాలలో ఉండి భార్యను హతమార్చిన భర్త
దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప మాల ధరించి కట్టుకున్న భార్యను కడతేర్చిన సంచలన ఘటన మేడ్చల్ జిల్లా (Medchal District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి (Medipally) పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారం (Prathapa Singaram) గ్రామంలో శ్రీకర్ రెడ్డి (Srikar Reddy), నిహారిక (Niharika) (35) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నిహారికకు ఆమె తల్లిదండ్రులు ఓ ఇళ్లు కూడా కొనిపెట్టారు. అయితే, అప్పటి నుంచి భార్యాభర్తల నడుమ గొడవులు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉన్నాడు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకర్ రెడ్డి (Srikar Reddy) తాను అయ్యప్ప మాలలో ఉన్నాననే విచక్షణ కోల్పోయి నిహారిక తలపై బండరాయితో వేసి హతమర్చాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.