- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
New Year: 2025కి వినూత్నంగా స్వాగతం పలికిన రైల్వే ఉద్యోగులు(వీడియో వైరల్)
దిశ,వెబ్‌డెస్క్: నేటి నుంచి నూతన సంవత్సరం(2025) ఆరంభమైంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా యువత అంగరంగవైభవంగా కొత్త ఏడాదికి(New Year) ఘన స్వాగతం పలికారు. నిన్న(డిసెంబర్ 31) అర్ధరాత్రి కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకోగా, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌లు కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న భారతీయ రైల్వే ఉద్యోగులు(Indian Railway employees)కూడా తమకు సాధ్యమైన రీతిలో సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకున్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రజెంట్ సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అవుతోంది.
రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, రైలు పైలట్లు చాలా ఉత్సాహంగా 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి సరిగ్గా 00:00 గంటలకు పైలట్లు రైలు హారన్లను కొద్దిసేపు ఏకధాటిగా మోగించారు. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్లు కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల న్యూ ఇయర్ వేడుక గూస్‌బంప్స్ తెప్పించిందని, 2025కి అద్భుతంగా స్వాగతం పలికారని కొందరు అభివర్ణించారు. ఇదొక స్ఫూర్తిదాయకమైన వేడుక అని, అక్కడ ఉన్న అందరినీ ఐక్యం చేసిందని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఈ సెలబ్రేషన్స్ ఏ రైల్వే స్టేషన్‌లో జరిగాయనేది తెలియరాలేదు.