- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు కీలక కేసులను ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు
దిశ, శేరిలింగంపల్లి : రెండు వేర్వేరు ఘటనల్లో నిందితులను అరెస్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు. సయ్యద్ జుబైర్ అలీ అలియాస్ ముజ్జు తన స్నేహితుడితో కలిసి దారి దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 5వ తేదీన తెల్లవారు జామున గచ్చిబౌలి టిసిఎస్ నుంచి లింగంపల్లి మార్గంలో స్కూటిపై వేళ్తున్న ప్రశాంత్, జాన్వీని ఫాలో అవుతూ బైక్ పై వచ్చిన సయ్యద్ జుబైర్ అతని స్నేహితుడు వారిని కత్తితో బెదిరించి యాభై వేల రూపాయల విలువ చేసే కమ్మలు, వెండి ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఒకే రోజు గచ్చిబౌలి నుంచి బీదర్ వరకు బైక్ పై వెళుతూ దాదాపు పది దోపిడిలకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు సయ్యద్ జుబైర్ అలీ అలియాస్ ముజ్జును అరెస్ట్ చేశారు. ముజ్జుపై 7 పాత కేసులు ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.
బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖరీదైన బైకులను దొంగలిస్తున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బహుదూర్ పూరకు చెందిన సర్దార్ కరణ్ వీర్ సింగ్ (24), బీకే గూడ ఎస్ ఆర్ నగర్ కు చెందిన సర్దార్ జగ్జీత్ సింగ్ (23)ఇద్దరు పాత నేరస్థులు. ఆయా నేరాల్లో శిక్షలు పడి జైలుకు వెళ్లారు. వీరిద్దరూ జైలులో ఉన్నప్పుడు మిత్రులుగా మారారు. బయటకు వచ్చాక వారిద్దరూ ఖరీదైన బైక్ లను చోరీ చేసి బీదర్ ఏరియాలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కరణ్ వీర్ సింగ్ గతంలో పంజాగుట్ట, హుమాయన్ నగర్, కూకట్ పల్లి, బేగంబజార్, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల చోరీలకు పాల్పడ్డాడు. ఏ2 జగ్జీత్ సింగ్ మియాపూర్, మాదాపూర్, చందానగర్, జీడిమెట్ల, ఆర్ సీపురం, కేపీహెచ్ బీ, జీడిమెట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. అలాగే ఎన్డీపీఎస్ కేసులు పోలీసులు జైలుకు పంపారు. బయటకు వచ్చాక కరణ్ వీర్ సింగ్, జగ్జీత్ సింగ్ ఇద్దరూ కలిసి బైక్ చోరీలకు పాల్పడుతూ వాటిని బీదర్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈనెల 8వ తేదీన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యమహా బైక్, రాయల్ ఏన్ఫీల్డ్ బైక్ లను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గచ్చిబౌలి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. సర్దార్ కరణ్ వీర్ సింగ్ పై ఇప్పటివరకు ఏడు కేసులు ఉన్నాయని, సర్దార్ జగ్జీత్ సింగ్ పై ఇప్పటివరకు 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ తెలిపారు. నిందితుల నుంచి రూ.3 లక్షల యాభై వేల విలువైన రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.