- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Terrarists: ఇద్దరు టెర్రరిస్టు సానుభూతి పరుల అరెస్ట్..కథువా దాడిలో ప్రమేయమున్నట్టు అనుమానం
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 8న జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులకు సహాయం చేసిన ఇద్దరు టెర్రరిస్టు సానుభూతి పరులను గురువారం అరెస్టు చేశారు. నిందితులను కథువా జిల్లాలోని బిలావర్, మల్హర్ ప్రాంతానికి చెందిన లియాఖత్, మూల్ రాజ్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఉగ్రవాదులకు ఆహారం, వైఫై సౌకర్యం కల్పించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కథువా ఘటన అనంతర ఉగ్రవాదుల ఆచూకీ కోసం పోలీసులు100 మందిని విచారించారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే తాజాగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిందితులు కీలక సమాచారాన్ని పోలీసులకు వెల్లడించడానికి నిరాకరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతుడటం ఆందోళన కలిగిస్తోంది.