Telangana Student: అమెరికాలో తెలుగు విద్యార్థి ఆర్యన్ రెడ్డి మృతి

by Mahesh Kanagandla |
Telangana Student: అమెరికాలో తెలుగు విద్యార్థి ఆర్యన్ రెడ్డి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(America)లో తెలంగాణ విద్యార్థి(Telangana Student) పాల్వాయి ఆర్యన్ రెడ్డి(23)(Palvai Aryan Reddy) మరణించాడు. ఇటీవలే కొనుగోలు చేసిన హంటింగ్ గన్ క్లీన్ చేస్తుండగా అది మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ ఆర్యన్ రెడ్డి ఛాతిలో నుంచి దూసుకెళ్లింది. జార్జియా రాష్ట్రంలో అట్లాంటా(Atlanta)లోని ఆర్యన్ రెడ్డి నివాసంలో నవంబర్ 13వ తేదీన బర్త్ డే వేడుకలు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. గన్ ఫైరింగ్ శబ్దం విని అదే ఫ్లాట్‌లో ఉన్న మిత్రులు ఆర్యన్ రెడ్డి రూమ్‌కు పరుగెత్తుకు వచ్చి చూడగా, ఆయన రక్తపు మడుగులో పడిపోయి ఉన్నట్టు చెప్పారు. వెంటనే సమీప హాస్పిటల్‌కు ఆర్యన్ రెడ్డి తరలించగా.. అక్కడ కాసేపటికే పరిస్థితులు విషమించి మరణించాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆర్యన్ రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని ధర్మపురి కాలనీలో నివాసం ఉంటున్నది. మిత్రుల ద్వారా ఆర్యన్ రెడ్డి మరణ విషయం తెలుసుకుని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆర్యన్ రెడ్డి కాన్సస్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆర్యన్ రెడ్డి చదువుపై ఎక్కువ శ్రద్ధపెట్టేవాడని, తన లక్ష్యాల ఛేదనకు పట్టుదలతో ఉండేవాడని తోటి మిత్రులు చెబుతున్నారు. ఆర్యన్ మరణంపై మిత్రులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు సంతాపం తెలిపారు. శుక్రవారం రాత్రే ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నట్టు తెలిసింది.

ఆర్యన్ రెడ్డి తండ్రి సుదర్శన్ రెడ్డి బోరున విలపిస్తూ.. విదేశాల్లో చదువుతున్న పిల్లలు గన్ లైసెన్స్ తీసుకునే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. అక్కడ విద్యార్థులు కూడా హంటింగ్ గన్ లైసెన్స్ పొందొచ్చని తమకు తెలియదని, ఇలాంటి విషాదాన్ని ఏ తల్లిందండ్రికీ ఎదరుకాకూడదన్నారు.

Advertisement

Next Story

Most Viewed