- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Farmers: అన్నదాతల ఆందోళన.. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు
దిశ, నేషనల్ బ్యూరో: రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ (Delhi Chalo) కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. పంటలకు కనీస మద్దతు (MSP) ధర కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అన్నదాతలు పాదయాత్ర చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో హర్యానా, పంజాబ్ రైతులు (Farmers) పాదయాత్ర చేపట్టారు. అయితే, వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా దేశరాజధానిలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చెలరేగింది. బారికేడ్లను దాటుకొని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా.. ఎన్ హెచ్ 44పై ఏర్పడిన గందరగోళ పరిస్థితుల వీడియో వైరల్ గా మారింది.
వ్యవసాయమంత్రి ప్రకటన..
మరోవైపు, రైతుల పాదయాత్ర ప్రారంభం కాకముందే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కనీస మద్దతు ధరపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు మోడీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. మోడీ గ్యారంటీని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. అయితే, ఉత్పత్తి ధరకంటే కనీసం 50శాతం అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్ చెప్పిందని చౌహాన్ వివరించారు. కానీ, మోడీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్, జొన్న పంటలకు ఉత్పత్తి ధరకంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు. ఇకపోతే, రైతుల ఆందోళనపై హర్యాన ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. అయిదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 9 వరకు అమల్లో ఉండనున్నట్లు హర్యానా సర్కారు వెల్లడించింది.