Teachers day 2024: "నేషనల్ టీచర్స్ డే- 2024" థీమ్.. ఇదే!

by Geesa Chandu |
Teachers day 2024: నేషనల్ టీచర్స్ డే- 2024 థీమ్.. ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవ(Teachers day) వేడుకలకు నేటితో 62 ఏళ్లు నిండాయి. సరిగ్గా ఇదే రోజున, అనగా.. మొదటిసారి ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారతదేశంలో 1962 సెప్టెంబర్ 5 న నిర్వహించారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఉపాధ్యాయుల పట్ల గౌరవమర్యాదలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితం చేయబడింది. ఎందుకంటే ఇదే రోజు దేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలందించిన.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. ఈయన 1888 సెప్టెంబర్ 5 వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. రాధాకృష్ణన్ మైసూర్ యూనివర్సిటీలో తత్వశాస్త్ర ప్రొఫెసర్ గా సేవలందించారు. విద్యారంగంలో విశేషమైన కృషి చేశారు. రాధాకృష్ణన్ కు పిల్లలపట్ల ఆప్యాయత, అనురాగాలు ఎక్కువ. విద్యార్థుల పట్ల లోతైన సున్నితత్వమే సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శ ఉపాధ్యాయుడిని చేసింది.

అయితే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 సంవత్సరంలో రాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో.. ఆయన ప్రియమైన విద్యార్థులు రాధాకృష్ణన్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని సూచించడం వలన, ఆయన తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు.. ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుందామని చెప్పారు. దీంతో ఆనాటి నుంచి నేటివరకు సెప్టెంబర్ 5 ను.. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుల కృషి, త్యాగం, నిస్వార్ధ సేవను గౌరవించడం అనేది.. ఉపాధ్యాయ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఉపాధ్యాయులు అనేవారు పిలల్లకు జ్ఞానాన్ని అందించడమే కాక, వారి జీవితాన్ని తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు. కనుక ఉపాధ్యాయుల సేవలను కొనియాడడానికి, వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఉన్న గొప్ప రోజు ఈ టీచర్స్ డే. ఇక ఈ ఏడాదిలో నిర్వహిస్తున్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ థీమ్- "సుస్థిర భవిష్యత్తు కోసం అధ్యాపకులను శక్తివంతులను చేయడం"(Empowering educators for a sustainable future). ఈ థీమ్ అనేది.. ఉపాధ్యాయుల యొక్క పాత్రను, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో వారి సహకారాన్ని తెలియజేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed