తమిళ నటుడు కరుణాస్ బ్యాగులో బుల్లెట్స్ కలకలం

by Shamantha N |
తమిళ నటుడు కరుణాస్ బ్యాగులో బుల్లెట్స్ కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళ సీనియర్‌ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ బ్యాగులో భారీ సంఖ్యలో బుల్లెట్లు బయటపడ్డాయి. చెన్నై ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం కొచ్చి ఫ్లైట్ ఎక్కేందుకు కరుణాస్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ తనిఖీలు చేపట్టగా.. ఆయన బ్యాగులో 40 బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో కరుణాస్ ని ఎయిర్ పోర్టు అధికారులు ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించలేదు.

ఫ్లైట్ ఎక్కకుండానే వెళ్లిపోయిన కరుణాస్

బుల్లెట్లు ఎందుకు క్యారీ చేస్తున్నారని కరుణాస్ ని అధికారులు ప్రశ్నించారు. తన దగ్గరున్న లైసెన్స్ గన్ కి సంబంధించి డాక్యుమెంట్లను ఆయన అధికారులకు చూపించారు. కొచ్చి వెళ్లాలనే తొందరలో బ్యాగులో బుల్లెట్లు తీయడం మర్చిపోయినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో కరుణాస్ చెప్పిన సమాధానంపై అధికారులు సంతృప్తి చెందారు. కరుణాస్ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే, బుల్లెట్లు ఉన్న బ్యాగులో ఫ్లైట్ ఎక్కేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో, ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు అధికారులు అనుమతిచ్చారు.

Advertisement

Next Story