- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రిమినల్ చట్టాలపై స్టే విధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడంటే?
దిశ, నేషనల్ బ్యూరో: క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. క్రిమినల్ చట్టాల్లో లోపాలు, వ్యత్యాసాలు ఉన్నాయని పలువురు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్ లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టనుంది.
గతేడాది డిసెంబర్ 21న మూడు కీలక క్రిమినల్ బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టగా.. వాటికి పార్లమెంటులో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆ బిల్లులకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది.
అయితే, మూడు క్రిమినల్ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారి సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ప్రతిపక్ష సఘభ్యులు సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఎలాంటి చర్చ లేకుండానే చట్టాలను ఆమోదించారని పిల్ లో పేర్కొన్నారు. మూడు కొత్త క్రిమినల్ చట్టాల సాధ్యతను అంచనా వేసే నిపుణుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు క్రిమినల్ చట్టాలపై స్టే విధించాలని మరికొందరు సుప్రీంను ఆశ్రయించారు. అన్ని పిటిషన్లపై సోమవారం వాదనలు విననుంది సుప్రీం ధర్మాసనం.