ఎన్నికల బాండ్ల పథకంపై విచారణ కోరుతూ వేసిన పిల్ పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం

by S Gopi |
ఎన్నికల బాండ్ల పథకంపై విచారణ కోరుతూ వేసిన పిల్ పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల బాండ్ల పథకంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఎన్‌జీఓలు దాఖలు చేసిన ఈ పిల్‌లో రాజకీయ పార్టీలు, కార్పొరేషన్‌లు, దర్యాప్తు సంస్థల మధ్య 'స్పష్టమైన క్విడ్ పోకో' అని ఆరోపించింది. గత కొన్ని నెలలుగా అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ పిటిషన్ విచారణకు రాలేదని ఎన్‌జీఓల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం ముందు విన్నవించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మెయిల్ పంపండి లిస్ట్ అవుతుందని చెప్పారు. ఇదొక కుంభకోణమని, వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన షెల్ కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీలు అందించే నిధుల గురించి దర్యాప్తు చేసేందుకు అధికారులకు ఆదేశాలివ్వాలని ఎన్‌జీఓలు పిటిషన్‌లో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకోలో భాగంగా కంపెనీలు విరాళంగా ఇచ్చిన డబ్బులు రికవరీ చేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 15న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story