నరోదా గామ్ కేసు తీర్పుపై సుప్రీం కోర్టు సిట్

by Vinod kumar |
నరోదా గామ్ కేసు తీర్పుపై సుప్రీం కోర్టు సిట్
X

అహ్మదాబాద్: గుజరాత్ లోని నరోదా గామ్ అల్లర్ల కేసును గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. 2002లో గోద్రా రైలు దుర్ఘటన సందర్భంగా 11 మందిని ఊచకోత కోసిన ఈ కేసులో మాజీ మంత్రి మాయా కొద్నానీ, భజరంగ్ దళ్ నాయకుడు బాబు భజరంగి సహా 67 మంది నిందితులను నిర్దోషులుగా అహ్మదాబాద్ లోని ప్రత్యేక కోర్టు ఇటీవల విడుదల చేసింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టు నియమించిన సిట్ గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేస్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed