Flash News: వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-28 08:56:08.0  )
Flash News: వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
X

దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడం తప్పు కాదన్న అత్యున్నత న్యాయస్థానం.. సుదీర్ఘకాలం పాటు శృంగారం చేసి.. విబేధాల కారణంగా విడిపోయాక మహిళలు పురుషులపై రేప్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని కచ్చితంగా చెప్పలేమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం అభిప్రాయ పడింది. ముంబైలోనే ఖర్గార్ స్టేషన్ లో ఏడేళ్ల క్రితం ఓ వివాహితుపై విడో పెట్టిన రేప్ కేసుపై విచారణ చేసిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె కేసును ధర్మాసనం కొట్టివేసింది.

Advertisement

Next Story