వీధి కుక్క‌ల‌కు ఆ హ‌క్కు ఉంది.. సుప్రీం కోర్టు తీర్పు!

by Sumithra |
వీధి కుక్క‌ల‌కు ఆ హ‌క్కు ఉంది.. సుప్రీం కోర్టు తీర్పు!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః వీధి కుక్క‌ల‌కు ప్ర‌జ‌లు ఆహారం ఇవ్వ‌డం వ‌ల్ల‌ వీధికుక్కల బెడద పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ మార్చి 4న సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీం కోర్టు తన‌ అభిప్రాయాన్ని మార్చుకుంది. నివాసితులు తమ నివాస ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడానికి అనుమతిస్తూ 2021లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. గ‌తంలో తాము ఇచ్చిన‌ స్టే ఆర్డర్‌ను రద్దు చేసింది. వీధి కుక్కలకు ఆహారం తీసుకునే హక్కు ఉంద‌ని, అలాగే పౌరులకు వాటికి ఆహారం పెట్టే హక్కు ఉందని అ సంద‌ర్భంగా కోర్టు పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హ్యూమన్ ఫౌండేషన్ ఫర్ పీపుల్ అండ్ యానిమల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో స్టే విధించిందని జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

"వీధి కుక్కల పట్ల కనికరం ఉన్న వ్యక్తి ఎవరైనా తమ వ్యక్తిగత ప్రవేశ ద్వారం లేదా వారి ఇంటి వాకిలి వద్ద లేదా ఇతర నివాసితులతో పంచుకోని మరే ఇతర ప్రదేశంలో అయినా వాటికి ఆహారం ఇవ్వవచ్చు. కుక్కలకు ఆహారం ఇవ్వకుండా ఎవరూ నిరోధించలేరు" అని ఢిల్లీ హైకోర్టు ఆదేశం పేర్కొంది. తమ కాలనీలోని కుక్కలకు ఆహారం పెట్టే విషయంలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య మొదట వివాదం జరిగ్గా, వారిలో ఒకరు త‌మకు చెందిన‌ ఆస్తి దగ్గర వీధి కుక్కలకు ఆహారం ఇవ్వకుండా నిరోధించాలని హైకోర్టును కోరారు. ఆ తర్వాత, ఇద్దరి మధ్య సెటిల్మెంట్ జరిగి, కుక్కలకు ఆహారం ఇచ్చే స్థలం నిర్ణయించుకున్నారు. ఈ కేసు సంద‌ర్భంలోనే కోర్టులు స‌ద‌రు నిర్ణ‌యాలు వ్య‌క్త‌ప‌రిచాయి.

Advertisement

Next Story

Most Viewed