- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరికొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్.. ల్యాండ్ అయ్యేది అక్కడే!

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) భూమి మీద అడుగుపెట్టబోతున్నారు. బుధవారం(19-03-2025) తెల్లవారుజామున 3:27 గంటలకు భూమి మీదకు రాబోతున్నారు. ఫ్లోరిడా తీరం(Florida Coast)లోని సముద్రజలాల్లో వారి క్యూ డ్రాగన్ వ్యామనౌక దిగనున్నది. ఆమె దిగడానికి కాస్త ముందు.. అంటే సరిగ్గా తెల్లవారుజామున 2:41 గంటలకు వ్యామనౌక క్యూడ్రాగన్ ఇంజిన్ల ప్రజ్వలన జరుగనుంది. సముద్ర జలాల్లో దిగిన వెంటనే వ్యామనౌకను నాసా(NASA) సిబ్బంది బయటకు తీస్తారు. ఆ తర్వాత సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్(Barry Wilmore)ను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
కాగా, 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్టార్ లైనర్ నౌక(Boeing Starliner)లో 7 రోజుల మిషన్ కోసం సునీతా, విల్మోర్‌లు అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. వెళ్లిన వారంరోజుల్లో తిరిగి రావాల్సిన వారు సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి వచ్చింది. చివరకు ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున వారు భూమి మీదకు దిగబోతున్నారు.
సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు రావాలని గుజరాత్‌లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ప్రార్థనలు చేస్తున్నారు.