జంతువులకు కూడా ఆదివారం సెలవు ఎక్కడో తెలుసా?

by samatah |
జంతువులకు కూడా ఆదివారం సెలవు ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆదివారం అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది సెలవు. సంతోషంగా ఫ్యామిలీతో ఏంజాయ్ చేయోచ్చు అనుకుంటారు. వారం రోజులు వర్క్ చేసి అలసిపోయి సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. అయితే మనుషులకు సరే మరి జంతువులకు? ఆవు, గేదె, ఎద్దు వంటి జంతువులు.. మనకు పనిలో ఎంతగానో సహాయపడతాయి. మనకోసం పాలు ఇస్తాయి. పొలాలను దున్నుతాయి. మరి వాటికీ ఆదివారం సెలవు ఉండాలి కదా. అందుకే జార్ఖండ్‌లోని లతేహర్ గ్రామంలో జంతువులకు కూడా ఆదివారం సెలవు ఇచ్చే సంప్రదాయం ఉందంట.

ఎందుకంటే. పది సంవత్సరాల క్రితం పని చేస్తూ ఓ ఆవు పొలంలోనే చనిపోయిందంట. అది చనిపోవడంతో అందరూ బాధపడ్డారంట. దీంతో పశువులకు కూడా అక్కడ ఆదివారం సెలవు ప్రకటించారంట. ఇక ఆ రోజు నుంచి లతేహర్ గ్రామంలో జంతువులకు, పశువులకు రోజంతా విశ్రాంతి ఇస్తారంట.

Advertisement

Next Story

Most Viewed