సుఖేశ్ VS ఆప్.. లెటర్ పాలిటిక్స్ ఫ్రమ్ జైల్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-07 07:14:45.0  )
సుఖేశ్ VS ఆప్.. లెటర్ పాలిటిక్స్ ఫ్రమ్ జైల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణంలో డబ్బులు ఇచ్చానని తిహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ వరుసగా లేఖలు రాయడం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలతో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ కుమ్మక్కయ్యారని సుఖేశ్ ఆరోపణలు గుప్పిస్తూ గురువారం సుఖేశ్ రెండో లేఖను విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా ఆప్ నేత మనీష్ సిసోడియా తిహార్ జైలు నుంచే దేశ ప్రజలకు లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది.

సిసోడియా రాసిన లేఖను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తక్కువ చదువుకున్న ప్రధాని ఉండటం దేశానికి చాలా ప్రమాదకరమని మోడీకి సైన్స్ అర్థం కాదు. విద్య ప్రాముఖ్యత అర్థం కాదు. గత కొన్నేళ్లుగా 60 వేల స్కూల్స్ మూతపడ్డాయి అని తన లేఖలో ప్రస్తావించారు. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యావంతులైన ప్రధాని అవసరం అని సిసోడియా పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంలో ఆప్ ను టార్గెట్ చేస్తూ సుఖేశ్ తిహార్ జైలు నుంచే లేఖను రాస్తే అదే జైలు నుంచి సిసోడియా లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జైలు నుంచి సాగుతున్న లేఖల రాజకీయం ఎటువైపు వెళ్తాయో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed