- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Students: విదేశాల్లో ఉన్నత విద్య.. ఐదేళ్లలో 52శాతం పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య
దిశ, నేషనల్ బ్యూరో: విదేశాల్లో చదువుతున్న భారతీయుల సంఖ్య గత ఐదేళ్లలో 52.2శాతం పెరిగిందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభ(Rajya sabha)కు తెలియజేసింది. కేరళకు చెందిన సీపీఎం ఎంపీ వీ శివదాసన్ (Shivadasan) అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ (Sukantha majundar) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019లో 5,86,337 మంది విద్యార్థులుండగా 2023లో ఆ సంఖ్య 8,92,989కి పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న విద్యార్థుల్లో అమెరికాలో 2,34,473 మంది, కెనడాలో 2,33,532 మంది, బ్రిటన్‌లో 1,36,921 మంది ఉన్నట్టు తెలిపారు.
కొవిడ్ పరిస్థితుల వల్ల 2019 నుంచి 2020 మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 55.7శాతం తగ్గిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నిబంధనలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లో కెనడా భారతీయ విద్యార్థుల నమోదులో 76 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2019లో 132,620 మంది విద్యార్థులు ఉండగా.. 2023లో ఆ సంఖ్య 233,532కి పెరిగింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. అలాగే అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 91శాతం పెరిగింది. 2019లో 1,22,535 ఉండగా 2023లో 234,473కి చేరింది.