Vande Bharat Express: విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

by Shamantha N |
Vande Bharat Express: విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బగ్బాహారా రైల్వేస్టేషన్ పరిధిలో దుర్గ్‌-విశాఖపట్నానికి (Durg-Visakhapatnam Vande Bharat Express) రాకపోకలు సాగించనుంది. అయితే, ఛత్తీస్ గఢ్ లో ట్రయల్ రన్ జరుగుతుండగా కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో, రైలు అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురుని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులది బాగ్బహారా ప్రాంతమని తెలిపారు. వారిపై రైల్వే చట్టం, 1989 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ

ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రున్నాయి. వీటిని ఈనెల 16న అహ్మదాబాద్‌ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రెండు రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ మధ్య రాకపోకలు జరపనుంది. మరో వందేభారత్ .. మరోటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. అంతే కాకుండా గుజరాత్ లోని భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు భారతదేశపు తొలి వందేభారత్ మెట్రోను మోడీ సోమవారం ప్రారంభించనున్నారు. అలానే వారణాసి నుంచి ఢిల్లీకి 20 కోచ్ ల వందేభారత్ రైలు కూడా ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story