నాందేడ్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

by M.Rajitha |
నాందేడ్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆగస్టు 14న నాందేడ్ శ్రీకాకుళం రోడ్ (07487) మధ్య ప్రత్యేక రైలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్ లో బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. అలాగే ఆగస్టు 15న గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుండి బయల్దేరి, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రైలు(07488) నాందేడ్ చేరుకోనుంది. థర్డ్ ఏసి స్లీపర్ కోచ్ లు మాత్రమే ఉండే ఈ రైలు ముద్కేడ్, ధరమాబాద్, బాసర, నిజామాబాద్. కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Next Story

Most Viewed